"నేను - యండమూరి"... అనగానే నాకు ఆయనకీ విడదీయలేని స్నేహం ఉందనుకునేరు .ఛ..ఛ..అలాంటిదేం లేదు..ఒకోసారి మనకి తెలీకుండానే మన జీవితాన్ని కొంతమంది ప్రభావితం చేస్తారు.నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో యండమూరి కూడా ఒకరు.నా లైఫ్ లో అన్ని కోల్పోయాను అనుకున్న సందర్బం లో ఆయన రచనలే నాకు తోడుగా నిలిచాయి.అవే నాకు నేస్తాలు అయ్యి ఆనందాన్ని ఇచ్చాయి, గురువులా పాఠాలు నేర్పించాయి,తండ్రిలా కర్తవ్యాన్ని బోధించాయి.నవలలు చదవడం వల్ల ఇన్ని జరుగుతాయి అని నాకు చదివే వరకు తెలీలేదు.ఒక నవల చదివేటప్పుడు మనల్ని మనం ఆ నవలలో ఉన్న పాత్రలతో పోల్చుకోగలిగితే ఆ రచయితకి అంత కన్నా పెద్ద విజయం ఉంటుందని నేను అనుకోను.అలాంటి విజయాల్ని యండమూరి ఎన్ని సాదించాడో లెక్క పెట్టడం కష్టమే.
ఆయన రచనల గురించి చెప్పాలంటే...ఎక్కడి నుంచి చెప్పనూ..ఏమని చెప్పనూ.."చీకట్లో సూర్యుడు","యుగాంతం" లో సైంటిస్ట్ లా ప్రపంచానికి విజ్ఞానం పంచినా.."13-14-15" లో ఒక భార్య ఒంటరి తనాన్ని వివరించినా..ఒక ప్రేమికుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో వివరించినా.."అష్టావక్ర" లో 'జెనెటిక్స్' బోదించినా.."ఆఖరి పోరాటం " లో దొంగ స్వామీజీల పని పట్టినా.."వెన్నెల్లో ఆడపిల్ల" లో తన ప్రేయసిని చేరుకోవడానికి ప్రియుడు పడే తపనని వర్ణించినా..."తులసిదళం" తో అందర్నీ బయపెట్టినా .."ఆనందో బ్రహ్మ " లో భవిష్యతు గురించి చెప్పినా,ప్రేమకీ -ఆకర్షణకీ మద్య ఉన్న చిన్న గీతని తన అద్బుతంగా వర్ణించినా.."లేడీస్ హాస్టల్" లో ఒక మరణ రహస్యాన్ని సోదించినా..యువత ఏ విధంగా తమ బాధ్యతల్ని మర్చిపోయి చెడిపోతున్నారో వివరించినా...ఆయనకీ ఆయనే సాటి.
"దిగితే గానీ లోతెంతో తెలిదు" అన్నట్టుగా .."రాస్తే గానీ అందులో ఉన్న కష్టం" ఏంటో తెలిదు.ఆయన ఒక నవల రాయడానికి ఎంత శ్రద్ధ తీస్కుంటారో ఆయన నవలలు చదివే వాళ్ళకి బాగా తెలసు.కథ రాయడం అంత తేలికేం కాదు..ఒక రచన చేసే ముందు ఎంత పరిశోదన చేయాలో..ఎన్ని నిద్ర లేని రాత్రులు గడపాలో రాసే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.అయినా రచన పూర్తవగానే నవమాసాలు మోసి బిడ్డని కన్న తల్లి లాగా రచయిత పడే ఆనందం మాటల్లో చెప్పలేనిది.అదే నవల విజయం సాదిస్తే ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినంత ఆనందం.
చివరగా నేను చెప్పేది ఏంటంటే అందరూ నవలలు చదవండని..అవి ఎప్పుడు మనతోనే ఉంటూ మనకు సంతోషాన్ని ఇస్తాయి.మనుషుల్లాగా ఇష్టం వచినప్పుడు మనతో ఉండి..అవసరం తీరగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోవు..ఒంటరి తనాన్ని అనుభవించే ఎవరికైనా నేనిచ్చే సలహా ఒకటే.."పుస్తకాల పురుగు" అవ్వండి..మీ ఒంటరితనం ఇక దరిచేరదు...

Hi, nee blog chadivanu bagundi:-)
ReplyDeleteplease visit my blog too http://serialmutchata.blogspot.com/