ఎడాదికెన్ని రోజులు?
తెలివి తేటలు, కామన్ సెన్స్ లేని మనిషి ఏవిధంగా మాటల్లో మోసపోతాడో చూడండి.
ఒక గుమాస్తా యజమాని వద్దకు వచ్చి ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇమ్మని అడిగాడు.
"ఒకరోజు శెలవు కావాలా?"
"అవును సార్"
"సంవత్సరానికి 365 రోజులు రోజుకి నువ్వు ఏడుగంటలు పని చేస్తావు. ఆంటే నా దగ్గర 106 రోజులు పనిచేస్తున్నావన్నమాట. 365*7/24 అంతే కదా! అందులో 52 ఆదివారాలు. పది జాతీయ శలవు దినాలూ పొతే యిక మిగిలేదెంత?
"44 రోజులండి"
"రోజుకు గంట లంచ్ టైం , అరగంట టీ టైం లెక్కగడితే ఎన్ని రోజులవుతుంది?"
"43 రోజులండి"
"ఇంకెన్ని రోజులు మిగిలాయి?"
"ఒకరోజు"
"మరి ఆ ఒక్కరోజు నువ్వు శెలవు తీసుకుంటే ఎలా?"
గుమాస్తాకి ఏం మాట్లాడాలో తెలీదు. దీన్నే కామన్ సెన్స్ లేక పోవటం అంటారు.

త్యాగం
ఏమి ఆశించకుండా ప్రేమించటం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఒకటి చదవండి.
పదేళ్ళ జాన్, తన చెల్లితో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప పడిపోయి, తలకి గాయం తగిలి రక్తం చాలా పోయింది. జాన్ ది ఆ గ్రూప్ రక్తం "నువ్వు నీ చెల్లికి కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు 'సరే' అన్నాడు. ఆ కుర్రాడు ఎందుకు సంశయిన్చాడో డాక్టరు మరోలా అర్ధం చేసుకున్నాడు. "పెద్దనొప్పిగా ఉండదు. అయిదు నిమిషాల్లో అయిపోతుంది. తరువాత చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. తన శరీరంలోంచి రక్తం నెమ్మదిగా సీసాలోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమక్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గిరకొచ్చి "లే..చాక్లెట్ ఇస్తాను"అన్నాడు .
ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు.
"ఇంకా ఎంత సేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్".
డాక్టర్ విభ్రాంతుడై "రక్తం తీస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నవా!" అని అడిగాడు
"అవును"
డాక్టర్ గొంతు వణికింది."అనుకునే ఇచ్చావా?' అన్నాడు కంపిస్తూ.

No comments:
Post a Comment