Sunday, October 16, 2011

నేను - యండమూరి

                                  "నేను - యండమూరి"... అనగానే నాకు ఆయనకీ విడదీయలేని స్నేహం ఉందనుకునేరు .ఛ..ఛ..అలాంటిదేం లేదు..ఒకోసారి మనకి తెలీకుండానే మన జీవితాన్ని కొంతమంది ప్రభావితం చేస్తారు.నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో  యండమూరి కూడా  ఒకరు.నా లైఫ్ లో అన్ని కోల్పోయాను అనుకున్న సందర్బం లో ఆయన రచనలే నాకు తోడుగా నిలిచాయి.అవే నాకు నేస్తాలు అయ్యి ఆనందాన్ని ఇచ్చాయి, గురువులా పాఠాలు నేర్పించాయి,తండ్రిలా కర్తవ్యాన్ని బోధించాయి.నవలలు చదవడం వల్ల ఇన్ని జరుగుతాయి అని నాకు చదివే వరకు తెలీలేదు.ఒక నవల చదివేటప్పుడు మనల్ని మనం ఆ నవలలో ఉన్న  పాత్రలతో పోల్చుకోగలిగితే ఆ రచయితకి అంత కన్నా పెద్ద విజయం ఉంటుందని నేను అనుకోను.అలాంటి విజయాల్ని యండమూరి ఎన్ని సాదించాడో  లెక్క పెట్టడం కష్టమే.

                ఆయన రచనల గురించి చెప్పాలంటే...ఎక్కడి నుంచి చెప్పనూ..ఏమని చెప్పనూ.."చీకట్లో  సూర్యుడు","యుగాంతం"  లో సైంటిస్ట్ లా ప్రపంచానికి విజ్ఞానం పంచినా.."13-14-15" లో ఒక భార్య ఒంటరి తనాన్ని వివరించినా..ఒక ప్రేమికుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో వివరించినా.."అష్టావక్ర" లో 'జెనెటిక్స్'  బోదించినా.."ఆఖరి పోరాటం " లో దొంగ స్వామీజీల పని పట్టినా.."వెన్నెల్లో ఆడపిల్ల" లో తన ప్రేయసిని చేరుకోవడానికి  ప్రియుడు పడే తపనని వర్ణించినా..."తులసిదళం" తో అందర్నీ బయపెట్టినా .."ఆనందో బ్రహ్మ " లో భవిష్యతు గురించి చెప్పినా,ప్రేమకీ -ఆకర్షణకీ  మద్య ఉన్న చిన్న గీతని తన అద్బుతంగా వర్ణించినా.."లేడీస్ హాస్టల్" లో ఒక మరణ రహస్యాన్ని సోదించినా..యువత ఏ విధంగా తమ బాధ్యతల్ని మర్చిపోయి చెడిపోతున్నారో వివరించినా...ఆయనకీ ఆయనే సాటి.


                      "దిగితే గానీ లోతెంతో తెలిదు" అన్నట్టుగా .."రాస్తే గానీ అందులో ఉన్న కష్టం" ఏంటో తెలిదు.ఆయన ఒక నవల రాయడానికి ఎంత శ్రద్ధ తీస్కుంటారో ఆయన నవలలు చదివే వాళ్ళకి బాగా తెలసు.కథ రాయడం అంత తేలికేం కాదు..ఒక రచన చేసే ముందు  ఎంత పరిశోదన చేయాలో..ఎన్ని నిద్ర లేని రాత్రులు గడపాలో రాసే వాళ్ళకే ఆ బాధ  తెలుస్తుంది.అయినా  రచన పూర్తవగానే నవమాసాలు మోసి బిడ్డని కన్న తల్లి లాగా రచయిత పడే ఆనందం మాటల్లో చెప్పలేనిది.అదే నవల విజయం సాదిస్తే ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినంత ఆనందం.


                      చివరగా నేను చెప్పేది ఏంటంటే అందరూ నవలలు చదవండని..అవి ఎప్పుడు మనతోనే ఉంటూ మనకు సంతోషాన్ని ఇస్తాయి.మనుషుల్లాగా ఇష్టం వచినప్పుడు మనతో ఉండి..అవసరం తీరగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోవు..ఒంటరి తనాన్ని అనుభవించే ఎవరికైనా నేనిచ్చే సలహా ఒకటే.."పుస్తకాల పురుగు" అవ్వండి..మీ ఒంటరితనం ఇక దరిచేరదు... 
                     

telugu lyrics- చిరునవ్వుతో -సంతోషం సగం బలం

సంతోషం సగం బలం  హాయిగ నవ్వమ్మా..
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..

హో హో హో ...
సంతోషం సగం బలం  హాయిగ నవ్వమ్మా..
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే..
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా..
చుట్టమల్లె కష్టమొస్తే  కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు కాళ్ళు కడిగి స్వాగతించకు..
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేని పోనీ సేవ చేయకు..
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసము చాలు కదా..
ముసురుకునే నిసి విల విల లాడుతూ పరుగులు తీయదా..

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..

ఆశలు రేపినా అడిఆశలు చూపినా సాగే జీవితం అడుగైన ఆగదుగా..
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్ర మానుకోగలమా..
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా..
కలలు గనీ అవి కలలే అని తెలిసనదే  తెలివమ్మా..
కలతలన్నీ నీ కిలకిలతో చేరిపెయవే చిలకమ్మా ..

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..

సంతోషం సగం బలం  హాయిగా నవ్వమ్మా..
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా....

Monday, October 10, 2011

మనసులో మాట

మానస --- నా తల్లిదండ్రులు నాకు ఈ పేరు ఎందుకు  పెట్టారో ఏమో గానీ నేను నా పేరుకు తగ్గట్టే తయారయ్యాను.మానస అంటే మనసు అని అర్థం.నా మనసులో చాలా ఆలోచనలు వస్తుంటాయి,కాని ఏవి బయటికి చెప్పను.స్నేహితుల విషయంలో చాలా శ్రద్ధ తీస్కుంటాను.నాకు దగ్గరైన వాళ్ళతో వద్దన్న సరే మాట్లాడ్తూనే ఉంటా.కొత్త వాళ్ళతో అంత త్వరగా కలవలేను.కానీ ఏదైనా  పుస్తకం చదివినపుడు మాత్రం దాని గురించి అందర్తో మాట్లాడలనుకుంటా.అప్పుడే అనిపిస్తుంది నాకు చాలా మంది స్నేహితులు ఉంటే బాగున్ను అని.అందుకే ఒక బ్లాగ్ రాయాలని నిర్ణయించుకున్నా.ఈ బ్లాగ్ నా మనసుకి ప్రతిబింబం కావాలని ఆశిస్తూ వ్రాయడం ప్రారంబిస్తున్న.